Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగు (కలర్) వివక్ష అనేది సమాజంలో ఎంతటి తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే రంగు చాలా ముఖ్యమనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ టాలెంట్ ఉంటే రంగుతో పనిలేదని నిరూపించే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా మండాడి సినిమా సక్సెస్ మీట్ వేదికపై ఓ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తన సినిమాలో నటించిన సుహాస్ ‘నల్లగా’ ఉన్నాడంటూ అవమానించిన విషయం గురించి డైరెక్టర్ మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేవు. సినిమా షూటింగ్ సమయంలో నటుడు సుహాస్ ఎంతో బాధగా ఓ విషయం పంచుకున్నాడని, తన సొంత ఊర్లో కొందరు తనను చూసి.. ‘నువ్వు ఇంత నల్లగా ఉన్నావు అని అత్యంత దారుణంగా Racist కామెంట్స్ చేశారని, అప్పుడే అతనికి నేను ధైర్యం చెప్పానని, తమిళనాడులో ఎవరి రంగు (నలుపు) గురించీ మాట్లాడకండి. ఇక్కడ అలాంటి వివక్షకు తావు లేదు అంటూ డైరెక్టర్ కుండబద్దలు కొట్టారు.
అయితే దర్శకుడికి తెలియదో, లేక సుహాస్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ, సుహాస్‌ను తెలుగు సినిమా అభిమానులు ఎన్నడూ అతని రంగు గురించి ట్రోల్ చేయలేదు. ఊర్లలో స్నేహితులు రంగు గురించి కామెంట్లు చేసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా కొంచెం లావుగా ఉన్నోడిని బండోడు అని, సన్నగా ఉన్న వాడిని బక్కోడు అని, అలాగే కొంచెం రంగు తక్కువగా ఉంటే నల్లోడు, కర్రోడు అనుకోవడం సహజమే. కానీ, ఒక స్థాయికి వచ్చాక లేదా ఒక వయసు వచ్చాక అవన్నీ సిల్లీ కామెంట్స్ అని తీసి పక్కన పెట్టి పని చేసుకుంటూ వెళ్ళిపోతారు.
Also Read
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
సుహాస్ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ అతన్ని రంగు విషయంలో ట్రోల్ చేయలేదు. అతని సినిమాలు వర్కౌట్ అయితే అతని ప్రతిభను పొగిడారు, వర్కౌట్ అవ్వని రోజున లైట్ తీసుకున్నారు కానీ, ఎన్నడూ రంగు గురించి కామెంట్ చేయలేదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు రంగు గురించే అంత సీరియస్‌గా తీసుకుని ఉంటే.. రజినీకాంత్‌ను గుండెల్లో పెట్టుకొని తెలుగు అభిమానులు ఆయన సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్లు చేసి వందల కోట్ల కలెక్షన్లు ఇచ్చేవారా? అలానే ధనుష్, విజయ్ సేతుపతి లాంటి నటులను ఎంకరేజ్ చేసి వాళ్ళు చేసిన అన్ని సినిమాలను ఎంకరేజ్ చేసే వాళ్ళా? తెలుగు వాళ్లకు రంగుతో పనిలేదు, రూపంతో అంతకన్నా పని లేదు. మంచి సినిమా ఇస్తే ఏ భాష సినిమా అయినా, ఎవరు హీరోగా నటించినా గుండెల్లో పెట్టుకుంటారు.
తాజావార్తలు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!