తాజాగా జరిగిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, ‘ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఈ జన్మకు నేను మోహన్ బాబు గారి కొడుకుని’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో ముచ్చటించిన క్రమంలో, ఒక మీడియా ప్రతినిధి, ‘మోహన్ బాబు కుమారుడిగా మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని ప్రశ్నించారు. దానికి మనోజ్ స్పందిస్తూ, ‘ఆయన నుంచి ముందుగా నేర్చుకున్న విషయం ఎవరినీ మోసం చేయకూడదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి అనే విషయాలు ఆయన వద్ద నుంచి నేర్చుకున్నాను.
Also Read:Samantha : సమంత, రాజ్ పై శ్యామలి మరో పోస్ట్ ..!
ఆయనను చూస్తూ పెరిగాను. 2016 వరకు నేను ఆయనకు జిరాక్స్ కాపీలా ఉండేవాడిని. ఎప్పుడైతే సినిమాలకు గ్యాప్ వచ్చిందో, అప్పుడు కొంచెం ఆలోచనలో పడ్డాను. ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది ఆలోచించడం మొదలైంది. కొత్తవి నేర్చుకోవడం, పాతవి మానేయడం లాంటివి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, నేను ఎక్కడ తప్పు చేశాను అనేవి నేర్చుకున్నాను. ఒకటి ఆయన నుంచి నేర్చుకున్నది ఏదైనా ఉంటే, మనల్ని నమ్మిన వాళ్లను బాగా చూసుకోవడం, ఉన్న వాళ్లను ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడం. పదిమందికి సహాయం చేయడం. అన్నీ విషయాలకు పోరాడి సాధించారు. ఆయనను చూస్తూ పెరిగినప్పుడే నేను ఆయనలా ఉండాలని అనుకునేవాడిని. అదే నేర్చుకున్నాను, ఇప్పుడు దాని నుంచి బయటకు రాలేకపోతున్నాను’ అని అన్నారు.
Also Read:Manchu Manoj: నాకు మా మెంబర్ షిప్ ఇవ్వలేదు.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
మీడియా ప్రతినిధి వెంటనే, ‘మరి మీ బ్రదర్ విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారు?’ అని అడిగితే, కాస్త ఆలోచించి, ‘విష్ణు అన్న నుంచి ఏ పరిస్థితినైనా మాట్లాడి ఎలా చక్కదిద్దొచ్చు అనేది నేర్చుకోవాలని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. ‘నేర్చుకోవాలనుకునేది కాదు, ఇప్పటికే నేర్చుకున్నది ఏదైనా చెప్పండి’ అని అడిగితే, ‘మేమిద్దరం అన్నదమ్ములం, ఒకరి నుంచి ఒకరు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు సడన్‌గా అడిగితే చెప్పలేకపోతున్నాను’ అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
