David-Reddy-1: ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌లో స్పెషల్ గెస్ట్ రోల్.. ఎవరు ఆ స్టార్?
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక పవర్ ఫుల్ పీరియాడికల్ యాక్షన్ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘డేవిడ్ రెడ్డి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా ఈ చిత్రంలో మనోజ్ సరసన ‘ప్రిన్స్’ మూవీ ఫేమ్ మరియా హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మనోజ్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి..
Also Read : DeVara-2 :ఎన్టీఆర్ లేకుండానే మొదలవుతున్న ‘దేవర 2’..!
ఇక ఈ సినిమా కథ స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా సాగుతుంది. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ‘డేవిడ్ రెడ్డి’ అనే ఒక యోధుడి పాత్రలో మనోజ్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది. అయితే ఈ భారీ క్లైమాక్స్ సన్నివేశాల్లో మనోజ్ చేసే యాక్షన్ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా, క్లైమాక్స్‌లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ కూడా ఉండబోతోందన్న వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో మరో విభిన్నమైన అంశం ‘వార్ డాగ్’ అనే బైక్. దాదాపు 700 కేజీల బరువుండే ఈ బైక్‌ను సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు, ఇది చూడ్డానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. . పక్కా యాక్షన్, ఎమోషన్స్ కలిపి దర్శకుడు ఈ పీరియాడికల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్… అన్ స్టాపబుల్ బాక్సాఫీస్ ‘ధురంధర్’ రివెంజ్!
-
CM Chandrababu: అర్థమైందా రాజా..? రజనీకాంత్ డైలాగ్ చంద్రబాబు నోట..
-
Megastar Chiranjeevi: వారికి ‘మెగా’ భరోసా !
-
Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే
-
Chandrababu Birthday: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలన్నదే లక్ష్యం!
ట్రెండింగ్
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
-
స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!