Mana Shankara Vara Prasad Garu: గెట్ రెడీ.. మన ‘వరప్రసాద్’ గారు దిగుతున్నారు!
- జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు
- ప్రమోషనల్ వేటకు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి
- మన 'వరప్రసాద్' గారు దిగుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో భారీ హైప్ వచ్చింది. రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా.. 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు సిద్ధమవుతోంది.
షూటింగ్‌కు ముందే వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు అసలు సిసలైన ప్రమోషనల్ వేటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జనవరి 2న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ఇక ప్రమోషన్స్ పరంగా మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ రావిపూడి రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాగా.. మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అంటున్నారు. ఈ రెండింటిలో ఒక ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో, మరో ఈవెంట్‌ను తెలంగాణలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.
Also Read
- Blackmail : వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
- Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
- Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
- Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్'లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
Also Read: Gold and Silver Price: 21 వేలు పడిపోయిన సిల్వర్ రేట్.. 4 వేలు తగ్గిన బంగారం ధర!
మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్‌లపై తీసిన అదిరిపోయే సాంగ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడితో ప్రమోషన్స్ స్పీడప్ చేసి.. సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి అనిల్ సొంతగా చేసిన ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా వెంకటేష్ గారినే రంగంలోకి దించారు. ‘నేను పాడుతా అంటూ’ అంటూ వెంకీ చేసిన అల్లరిని మర్చిపోలేం. మరి వరప్రసాద్ గారులో చిరుతో ఏం చేయిస్తారో అని ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!