Site icon NTV Telugu

Mana Shankara Vara Prasad Garu: గెట్ రెడీ.. మన ‘వరప్ర‌సాద్’ గారు దిగుతున్నారు!

Chiranjeevi Promotions

Chiranjeevi Promotions

ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తైతే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. సాలిడ్ ప్రమోషన్స్ చేయాల్సిందే. ఇప్పుడు 2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ ఈవెంట్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ రావడంతో భారీ హైప్ వచ్చింది. రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ కానుండగా.. 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలకు సిద్ధమవుతోంది.

షూటింగ్‌కు ముందే వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు అసలు సిసలైన ప్రమోషనల్ వేటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. జనవరి 2న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ఇక ప్రమోషన్స్ పరంగా మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ రావిపూడి రెండు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒక‌టి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ కాగా.. మ‌రొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అంటున్నారు. ఈ రెండింటిలో ఒక ఈవెంట్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, మ‌రో ఈవెంట్‌ను తెలంగాణ‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం.

Also Read: Gold and Silver Price: 21 వేలు పడిపోయిన సిల్వర్‌ రేట్‌.. 4 వేలు తగ్గిన బంగారం ధర!

మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్‌లపై తీసిన అదిరిపోయే సాంగ్‌ను డిసెంబర్ 30న రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడితో ప్రమోషన్స్ స్పీడప్ చేసి.. సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి అనిల్ సొంతగా చేసిన ప్రమోషన్స్‌ అంతా ఇంతా కాదు. ఏకంగా వెంకటేష్‌ గారినే రంగంలోకి దించారు. ‘నేను పాడుతా అంటూ’ అంటూ వెంకీ చేసిన అల్లరిని మర్చిపోలేం. మరి వరప్రసాద్ గారులో చిరుతో ఏం చేయిస్తారో అని ఫాన్స్ ఆతృతగా ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.

Exit mobile version