OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!

Dhanush's Om

Dhanush's Om

ఎవరూ ఊహించని ఓ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వర్సటైల్ యాక్టర్ ధనుష్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఇలాంటి ఉద్దండులంతా ఒకే సినిమాలో కనిపిస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు ఆ అద్భుతమే జరగబోతోంది. రాజ్‌కుమార్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ మూవీ ‘#OM’ (ఓం) టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) రంగంలోకి దిగింది. సితార సంస్థ.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును నవంబర్ 20న ఏపీ, తెలంగాణల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతోంది.

సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్లు ఉంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది ఒకవైపు మమ్ముట్టి, ధనుష్.. మరోవైపు బాలీవుడ్ లెజెండరీ నటుడు నసీరుద్దీన్ షా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, క్రేజీ హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల కలిసి నటించడం మరో ఎత్తు. ఏకకాలంలో ఇంతమంది అగ్ర నటీనటులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి తెలుగు ప్రమోషన్స్‌ను సితార సంస్థ అప్పుడే వేగవంతం చేసింది. మరి ఇంతమంది స్టార్లతో వస్తున్న ఈ కల్ట్ మల్టీస్టారర్ తుఫాన్.. నవంబర్ 20న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీని సృష్టిస్తుందో చూడాలి!