స్టార్ హీరోయిన్స్ ఎవరూ మలయాళం వైపు మొగ్గు చూపరు. అదిరిపోయే కథ, నటిని బయటకు తీసుకొచ్చే పాత్రలు వచ్చినా సరే.. స్టార్స్ మలయాళం వైపు చూడాలి అనుకోరు. అనుష్క, సమంత, త్రిష వంటి స్టార్స్ ఇక్కడ బిజీగా ఉన్న సమయంలో మలయాళంలో నటించడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు.
చాలామంది కేరళ కుట్టీలు తెలుగు, తమిళంలో క్రేజ్ వచ్చేంతవరకే మలయాళాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఒక్కసారి స్టార్ హోదా దక్కితే, మాతృభాషలో నటించడానికి వందసార్లు ఆలోచిస్తారు. సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార.. ఒక్కో సినిమాకు ఎనిమిది నుండి 10 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం మలయాళంలో లేదు. ఈ మలబారు బ్యూటీ 2003లో ‘మనసినక్కరె’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. తన 26 ఏళ్ల కెరీర్‌లో పట్టుమని 10 మలయాళ చిత్రాలు కూడా చేయలేదు. బాలీవుడ్‌ను మెయిన్ టార్గెట్ చేసుకొని.. ముందుగా తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంటారు. అలా హోదా రాగానే ఆటోమేటిక్‌గా రెమ్యూనరేషన్ నాలుగు, ఐదు కోట్లకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్షలు తీసుకుని కన్నడలో, మలయాళంలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు. నయనతార, రష్మిక, కీర్తి సురేష్ నుంచి లేటెస్ట్ బ్యూటీ అనస్వర రాజన్ వరకు అందరి విషయంలోనూ ఇదే రెమ్యూనరేషన్ ఫార్ములా నడుస్తుంది.
అనస్వర రాజన్ మలయాళంలో చాలా కాలంగా నటిస్తున్నా.. తెలుగులో క్రేజ్ రావడంతో ఇక్కడ మంచి రెమ్యూనరేషన్ దక్కుతోంది. ‘ఛాంపియన్’తో ఎంట్రీ ఇచ్చిన ఈమె, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూతురిగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు ఛాన్సులను అస్సలు వదులుకోవడం లేదు. ఎందుకంటే, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా మొదట తెలుగులో స్టార్ అనిపించుకోవాలి. అందుకే మలయాళ బ్యూటీస్ తెలుగులో ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోరు. క్రేజ్ కు క్రేజ్, రెమ్యూనరేషన్ కు రెమ్యూనరేషన్.. అంతా ఇక్కడే దొరుకుతుంది.
