బీ టౌన్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా ఖాన్ ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడుస్తుంది. మలైకా, అర్జున్ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. దీంతో తన కంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమించడంపై మలైకాపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. కానీ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం తమమధ్య ఉన్న రిలేషన్ పై బహిరంగంగానే స్పందించారు. ప్రేమలో ఉన్నామంటూ ప్రకటించారు. ఇక తాజాగా తన 36 వ పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్ కపూర్ కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ స్పెషల్ పిక్ తో ప్రత్యేకంగా విషెష్ తెలియజేసింది మలైకా. “పుట్టినరోజు శుభాకాంక్షలు నా సన్ షైన్…” అంటూ అర్జున్ కపూర్ తో ఉన్న పిక్ ను షేర్ చేసిన మలైకా. అందులో వారిద్దరూ అథ్లెటిక్ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు. ఇక అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు.
Read Also : నాని సినిమాపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు
ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్, అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్, విజయ్ దేవరకొండ తదితరులు పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. 1985, జూలై 26న జన్మించిన అర్జున్ కపూర్ బాలీవుడ్ నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ వారసుడు. ఆయన తల్లి బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా కపూర్. 36 ఏళ్ల అర్జున్ ఈ మధ్యే ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంలో కనిపించాడు. నెక్ట్స్ హారర్ మూవీ ‘భూత్ పోలీస్’లో సైఫ్ అలీఖాన్, జాక్విలిన్, యమీ గౌతమ్ లతో పాటూ కనిపించనున్నాడు. వర్క్ ఫ్రంట్‌లో అర్జున్ కపూర్ “భూత్ పోలీస్”, “ఏక్ విలన్ రిటర్న్స్” అనే రెండు రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
A post shared by Malaika Arora (@malaikaaroraofficial)