2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది.
Kantara – ఒక సినిమా కాదు. ఒక కల్చరల్ ఎక్స్‌పీరియెన్స్. ఇప్పుడు రాబోతోన్న Chapter 1 కి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫోక్ మిస్టిసిజం, డెవోషనల్ టచ్, రియలిస్టిక్ యాక్షన్ ఇవన్నీ కలిస్తే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ కి కావాల్సిన అన్ని మసాలాలు సిద్ధం. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన కాంతారా రూ. 400 కోట్ల మార్క్ దాటిన రికార్డు ఉంది. అక్టోబర్ 2న విడుదలవుతున్నకాంతారా చాప్టర్ 1కు జస్ట్ టాక్ వస్తే రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంలో ఎలాంటి సందేహం లేదు!
Alpha – ఆలియా భట్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ రూ. 1000 కోట్లు సాధిస్తుందా అన్న సందేహం ఉన్నా… సినిమా స్కేల్, స్టోరీ ప్రెజెంటేషన్ చూస్తే గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ క్లియర్‌గా కనిపిస్తోంది. బాబీ డియోల్, హృతిక్ రోషన్ స్టార్ అప్పియరెన్స్ కూడా హైలైట్. యాక్షన్, ఎమోషన్, డ్రామా.. ఈ మూడు కలిస్తే Alpha హాలీవుడ్ రేంజ్ కలెక్షన్స్ సాధించే అవకాశముంది. డిసెంబర్ 25న రానున్న ఆల్ఫా, అలియా పాన్-ఇండియా క్రేజ్‌ని ప్రూవ్ చేసే మాస్టర్ టెస్ట్ కాబోతోంది.
Dhurandhar : ధురందర్ లో కనిపిస్తున్న రణ్‌వీర్ సింగ్ మాస్ అవతారం నెక్స్ట్ లెవెల్. రా ఇంటెన్సిటీ, స్టైలిష్ యాక్షన్, డార్క్ థ్రిల్లర్ వైబ్ ఇవన్నీ కలిసి రణ్‌వీర్ కి పాన్ ఇండియా మాత్రమే కాదు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ మాస్ కలెక్షన్స్ తెచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 5న రానున్న ఈ మూవీ, ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కంటెంట్ వర్కౌట్ అయితే, ధురందర్ 1000 కోట్ల క్లబ్ కి బిగ్గెస్ట్ కాంపిటేటర్ అవుతుంది.
తెలుగులో ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టగలిగే రాజాసాబ్ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుండడంతో టాలీవుడ్ నుండి మరే ఇతర సినిమాలకు ఆ అవకాశం లేనట్టే.
