NTV Telugu Site icon

Mahesh babu: వరల్డ్ వైడ్ 175 పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ స్పెషల్ షోస్!

Mahesh Babu

Mahesh Babu

పదహారేళ్ళ ప్రాయంలో మహేశ్ బాబు ‘పోకిరి’ సినిమా మరో సరికొత్త రికార్డ్ కు శ్రీకారం చుడుతోంది. ఆగస్ట్ 9వ తేదీ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ‘పోకిరి’సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శించాలని ఫాన్స్ తీర్మానించారు. మొదట అరవై, డబ్బై థియేటర్లలో ఈ షోస్ వేయాలని అనుకున్నా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 175కు పెరిగిపోయింది. ఒక్క నైజాంలోనే 54కు పైగా స్క్రీన్స్ లో ‘పోకిరి’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రసాద్స్ లోని బిగ్ స్క్రీన్ లో రాత్రి 8.00 గంటలకు, 11.00 గంటలకు ‘పోకిరి’ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అలానే జంట నగరాల్లో పలు థియేటరల్లో ఫస్ట్ అండ్ సెకండ్ షోస్ ప్రదర్శనకు ప్లాన్ చేశారు.

Read also: Electricity Amendment Bill 2022: విద్యుత్ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లుపై ఆందోళన.. స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు..

పదహారేళ్ళ క్రితం మహేశ్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రం అప్పట్లోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’, ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు’ లాంటి డైలాగ్స్ ఇప్పటికీ జనం నోటిలో నానుతూనే ఉన్నాయి. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ సైతం కుర్రకారును అప్పట్లో బాగా కిర్రెక్కించింది. ఇప్పుడు పదహారేళ్ళ తర్వాత కూడా ఆ సినిమాకు ఇలాంటి స్పందన రావడం విశేషమే. మహేశ్ కెరీర్ లోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమా స్పెషల్స్ షోస్ ద్వారా వచ్చే మొత్తాన్ని అభిమానులు మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు.
Nayanthara:పెళ్ళైనా తగ్గని క్రేజ్… నయన్ కు 10 కోట్లు!

Show comments