Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేసిన రాజమౌళి

Hbdsuperstarmahesh

Hbdsuperstarmahesh

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి.

కాగా నేడు సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేసారు రాజమౌళి. ఈ ఫోటోలు ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవి. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్‌ తో ఎక్స్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ‘రుద్ర’గా రౌద్రం చూపించిన మహేశ్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో లాంగ్ హెయిర్, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ లుక్ ఉబర్ కూల్ గా దర్శమిస్తున్నాడు సూపర్ స్టార్.  అయితే మహేశ్ బాబు ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నేడు పుట్టిన రోజు సందర్భాంగా శ్రీరాముడు లుక్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. కానీ అవేమి లేకుండా సింపుల్ పోస్టర్స్ తో సరిపెట్టేసాడు రాజమౌళి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు.