Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు డబుల్ ధమాకా లాంటి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మహేష్ కెరీర్లో మైండ్‌బ్లోయింగ్ హిట్స్‌గా నిలిచిన ‘పోకిరి’, ‘దూకుడు’ చిత్రాలు మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ రోజు (మే 31న) ఆయనకు నివాళులర్పిస్తూ ప్రత్యేక పోస్టర్ల ద్వారా మేకర్స్ ఈ రెండు చిత్రాలకు సంబంధించిన రీరిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఆగస్టు 7న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ ‘పోకిరి’ విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్లాన్ చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్‌లో మహేష్ బాబు ‘పండు గాడు’ అనే అండర్‌కవర్ కాప్‌గా నటించి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ మాత్రమే కాదు.. ‘జగడమే’, ‘డోలే డోలే’ వంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘అజయ్ కుమార్’ అనే పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
‘వారణాసి’కి ముందే ట్రీట్!
మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ (Varanasi) షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ లోపు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఈ రీ-రిలీజ్ ద్వారా ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. మొత్తానికి ఒకే రోజున మహేష్ బాబుకు సంబంధించిన రెండు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదని కామెంట్స్ వస్తున్నాయి.
Honouring the everlasting legacy of Super Star Krishna Garu on his birth anniversary. 🌟
A legend’s legacy.
A Superstar’s celebration. 🔥The fun, style, action and entertainment return to the big screen once again. 💥#Dookudu storms into theatres worldwide this August 7th 🎥… pic.twitter.com/MYwuEKyEaR
— 14 Reels Plus (@14ReelsPlus) May 31, 2026
Our Pandugadu returns to shake the big screens once again🤩
On the occasion of Super🌟@urstrulymahesh birthday 🔥#Pokiri4K 𝗥𝗘𝗜𝗚𝗡𝗜𝗧𝗜𝗡𝗚 𝗚𝗟𝗢𝗕𝗔𝗟𝗟𝗬 𝗧𝗛𝗜𝗦 𝗔𝗨𝗚𝗨𝗦𝗧 🌍❤️🔥
A film by #PuriJagannadh#Ileana #ManiSharma @PuriConnects@vaktacreations… pic.twitter.com/xFCcYr8mYV
— Pokiri4K (@PokiriTheMovie) May 31, 2026
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!