తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా “మ్యాజిక్ మూవ్ మెంట్స్” (మీరు అనుకున్నది కాదు) టైటిల్ లాంఛ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్లపై తల్లాడ శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.
చిత్ర సమర్పకులు కె. దశరథ్ మాట్లాడుతూ సాయికృష్ణకు సినిమా అంటే చాలా ప్యాషన్ ఉందని, ఆయన వినిపించిన ఈ కథ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందరినీ ఆకట్టుకుంటుందని ప్రశంసించారు. తన వంతు సహకారం అందించేందుకు సమర్పణకు ఒప్పుకున్నట్లు తెలిపారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ తమ ఇంట్లోని సాయిబాబా ఫొటో చూసి ఈ సినిమా స్క్రిప్ట్ ఆలోచన మొదలైందని తెలిపారు. మొదట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, వెంకట్ దుగ్గిరెడ్డి అన్న, తల్లాడ శ్రీనివాస్ గారు, అలాగే దశరథ్ గారి ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ మొదలైందని పేర్కొన్నారు. ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు డివోషనల్ టచ్ కూడా ఉన్న సినిమా అని, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సాయిబాబా ఆశీస్సులు, దశరథ్ సమర్పణలో రూపొందుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్, డివోషనల్ టచ్ ఉన్న చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సాయికృష్ణకు గొప్ప విజయాన్ని అందించాలని చిత్ర యూనిట్ సభ్యులు, అతిథులు ఆకాంక్షించారు.