Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలికిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరమీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు ‘పెద్ది’ బల్లగుద్ది రికార్డులు బద్దలకొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026! అన్నారు లిరిసిస్ట్ అనంత శ్రీరాం. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరూ ఆపలేరు అని గంటాపథంగా తెలియజేస్తున్నా. పెద్ది ఎవరో కాదు.. ఒక క్రాస్ ఓవర్ అథ్లీట్! కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట, ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ మరెవరో కాదు.. ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ ఇలా సానబడుతూ ఉంటారు; మా మెదళ్లకు అలా సానపెడుతూనే ఉంటారు. రేపు నాలుగో తారీఖున మీరు చూడబోయేది ‘పెద్ది’ సినిమా మొదటి ఆట కాదు, ‘పెద్ది’ని గెలిపించడానికి బుచ్చిబాబు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఈ సినిమా టీంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు.. ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాలపాలైనా షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకితభావం, మాలలో ఉన్నా సరే మల్లయోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటి వెనకాలున్న కథలు వింటూ ఉంటే మీకు ఒక్కొక్కరికీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం.కాని, ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే! ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు.. ఈ పెద్దిగాడి కథ! కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి, ఆడి పోరాడి, కండఖండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనబడుతుంటే.. అక్కడ కనిపించేది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె, ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం! ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో, ఆ ఐదు ఎకరాల కోసం దేశం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరూ ఈ దేశానికి అయోధ్యే, అక్కడ పుట్టిన ప్రతి కొడుకూ రాముడే! కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నమూ యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి, అతని వెనుక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడూ హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే! కాబట్టి ఈ ‘పెద్ది’, కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా.. ఈ ‘పెద్ది’ కొండ కింద ఊరి రామాయణం. ఆ రామాయణం ఎంతకాలం నిలిచి ఉందో, ఈ ‘పెద్ది’ కథ కూడా కాలాల పాటు నిలిచి ఉంటుంది. ఒక సంవత్సరానికి 10 విజయాలు కాకుండా, 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ ‘పెద్ది’ నిలిచిపోతుందని బల్లగుద్ది మరి చెప్తున్నాను అని చెప్పుకొచ్చారు.
Also Read
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Hi: ఆగస్టు 14న కవిన్‌తో కలిసి 'హాయ్' అంటూ నయనతార హంగామా
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తాజావార్తలు
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్‌గాంధీ, ఖర్గే
-
Jitendra Singh: రాహుల్ గాంధీ మాటపై నిలబడటం లేదు..
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!