ప్రతి రోజూ వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం… ప్రేమ, పెళ్లి పేర్లతో యువతుల్ని మోసం చేసే దుర్మార్గులు గురించి. ఎన్ని ఘటనలు జరగినా కొందరు యువతులు మాత్రం అప్రమత్తంగా ఉండలేక పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో లవ్ ట్రాప్ లో పడ్డ ఓ జూనియర్ ఆర్టిస్టు కథ అందరినీ కదిలిస్తోంది. ప్రేమించానన్నవాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ చివరికి ఆమె నమ్మకాన్నే మోసం చేశాడు..
Chairman’s Desk : నాలుగోసారి గెలుపు ఖాయమేనా..?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి 2019లో సినిమాలపై ఆశతో హైదరాబాద్ వచ్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కాలక్రమంలో గాయత్రి హిల్స్‌లో ఓ జిమ్ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. అయితే కొన్నాళ్ళకే అతను మారిపోయాడు. అలా ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు.
పెళ్లిపై అతనికి ఆసక్తి లేదని తెలుసుకున్న ఆమె స్వగ్రామానికి వెళ్లిపోయింది. కానీ 2023 నవంబర్‌లో మళ్లీ హైదరాబాద్‌కి వచ్చింది. అప్పటికే తాను చేసిన తప్పును గుర్తించినట్టు నటిస్తూ.. ఈసారి పెళ్లే చేసుకుంటా అని మరోసారి ఆమెను కలిశాడు ఆ జిమ్ ట్రైనర్. పెళ్లికి ఖర్చు ఎక్కువవుతుందని చెప్పి రూ.15 లక్షలు తీసుకున్నాడు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత మళ్లీ మాయమయ్యాడు.
అతని తీరుపై అనుమానం వచ్చిన యువతి విచారణ చేయగా.. అతనికి అప్పటికే పెళ్లి అయిందని బయటపడింది. తీవ్ర ఖంగుతిన్న బాధితురాలు అతడిని నిలదీసి, తీసుకున్న డబ్బులు ఇచ్చేయమని డిమాండ్ చేసింది. కానీ అతను తప్పించుకుంటూ తిరుగుతుండడంతో, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రస్తుతం కేసులో దర్యాప్తు చేస్తున్నారు.
VD 12 : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ.?