ప్రస్తుతం తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాల్ని క్రియేట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇటీవలి ప్రమోషన్స్‌లో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది. గత 40 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త కోణంలో కనిపిస్తాను’ అని చెప్పారు. ఇప్పుడీ వ్యాఖ్యలకూ మించి, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : Infertility Causes in Women : పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..!
‘నాగ్ సార్‌ని ఒప్పించడం అంత ఈజీ కాదు. తన పాత్రకు సంబంధించిన ఐడియా చాలా నచ్చింది కానీ, దాన్ని ఫుల్‌గా కన్‌విన్స్ చేయడం మాత్రం నిజంగా సవాలుగా మారింది. ఏకంగా ఏడెనిమిది సార్లు నరేషన్ ఇచ్చాను’ అని లోకేష్ వెల్లడించారు.ఈ వ్యాఖ్యలతో నాగార్జున తన పాత్రల ఎంపికలో ఎంత క్లారిటీ, పెర్ఫెక్షన్ కలిగి ఉంటారో ప్రేక్షకుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘కూలీ’ సినిమా కోసం రజనీ, నాగ్ ల కలయిక పై అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘కూలీ’ సినిమా కేవలం రజనీకాంత్ మాస్ కామ్‌బ్యాక్ మాత్రమే కాదు, డైరెక్టర్ లోకేష్ స్టైల్‌ను పాన్ ఇండియా స్థాయిలో మరోసారి ఎస్టాబ్లిష్ చేసే యత్నం కూడా. ఈ సినిమాలోని కంటెంట్, నటీనటుల హై లెవెల్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలసి భారీ హిట్‌ను గ్యారెంటీ చేస్తున్నాయి.