తల్లి అవ్వడం ప్రతి మహిళ జీవితంలో ఒక గొప్ప అనుభూతి. కానీ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లోపం వంటి అనేక కారణాల వల్ల నేటి తరంలో చాలా మంది మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య నిపుణుల ప్రకారం, భారతదేశంలో ప్రతి ఆరు జంటలలో ఒక జంట తల్లిదండ్రులవడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో, మహిళల్లో గర్భం దాల్చడాన్ని ఆటంకపెట్టే కారణాలు, జాగ్రత్తలు, చికిత్సా మార్గాలు గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.
మహిళల్లో గర్భం రాకపోవడానికి ప్రధాన కారణాలు:
1. అండోత్పత్తిలో ఆటంకం,నెలసరి చక్కగా రాకపోవడం, PCOD / PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), హార్మోన్ల అసమతుల్యత,థైరాయిడ్ సమస్యలు
2. గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ సమస్యలు..ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవడం,గర్భాశయ నిర్మాణ లోపాలు,పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (PID)
3. వయస్సు ప్రభావం..35 ఏళ్ల తర్వాత గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి. అండాల నాణ్యత క్రమంగా పడిపోతుంది.
దినచర్యలో చేసే పొరపాట్లు గర్భం రాకపోవడానికి కారణం కావచ్చు:
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతాయి. అధిక ఒత్తిడికి గురవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం,వ్యాయామం చేయకపోవడం,అధిక బరువు / తక్కువ బరువు, ధూమపానం, మద్యం వంటి అలవాట్లు, నిర్దిష్టంగా పీరియడ్ చక్రం గురించి అవగాహన లేకపోవడం,ఈ అలవాట్లు శరీర హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి అండాశయ పనితీరుపై ప్రభావం చూపుతాయి.
పురుషులు కూడా సమాన బాధ్యత కలవారు:
చాలా సందర్భాల్లో గర్భం రాకపోవడానికి పురుషుల వైపు కారణాలు ఉంటాయి. కానీ తక్కువ స్పెర్మ్ కౌంట్,స్పెర్మ్ నాణ్యత లోపం, జంటలు ఇద్దరూ పరిశీలించబడటం చాలా ముఖ్యం. ఒకవైపు తప్పు ఉంచడాన్ని నివారించాలి.
తదుపరి దశ: వైద్య పరీక్షలు & చికిత్సలు
హార్మోన్ టెస్టులు, మహిళలలో అండోత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి, అల్ట్రాసౌండ్ స్కాన్ – గర్భాశయ పరిస్థితి తెలుసుకోటానికి,హిస్టీరోసాల్పింజోగ్రఫీ (HSG) – ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయా చూడటానికి, స్పెర్మ్ ఎనాలిసిస్ – పురుషుల్లో స్పెర్మ్ గుణాత్మకత తెలుసుకోవటానికి ఇలా అని రాకాల టెస్ట్ లు చేసుకొవాలి అప్పుడు అసలైన ప్రాబ్లం అనేది తెలుస్తోంది.
గర్భధారణకు సహాయపడే మార్గాలు:
పీరియడ్ సైకిల్ తెలుసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, ప్రినేటల్ సప్లిమెంట్లు (ఫోలిక్ యాసిడ్, విటమిన్ C) తీసుకోవడం, క్రమంగా వ్యాయామం చేయడం, వైద్యుల సలహా మేరకు అవసరమైనప్పుడు మందులు వాడటం.
IVF – ఒక ప్రత్యామ్నాయ మార్గం:
కొన్ని సందర్భాల్లో సహజంగా గర్భం దాల్చలేని పరిస్థితుల్లో వైద్యులు IVF (In-Vitro Fertilization) సిఫార్సు చేస్తారు. ఇది శరీరం వెలుపల అండం, స్పెర్మ్‌ను కలిపి పిండంగా తయారు చేసి గర్భాశయంలోకి అమర్చే ప్రక్రియ. ఈ మధ్య కాలంలో
ముగింపు: తల్లి కావడం సాధ్యం — అయితే సరైన మార్గంలో!
ఈ రోజుల్లో గర్భం దాల్చడంలో ఇబ్బంది సాధారణం అయిపోయింది. కానీ కారణాలను అర్థం చేసుకొని, జీవితశైలిలో మార్పులు చేసి, వైద్యుల సలహాతో ముందుకెళ్తే ఇది పూర్తిగా అధిగమించగల సమస్య. ఇందులో మహిళలు, పురుషులు ఇద్దరూ సమానంగా బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, నమ్మకమైన వైద్య మద్దతుతో తల్లి కావడం నిజంగా సాధ్యం!