AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్‌ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?

Aa 23

Aa 23

కూలీ తర్వాత డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్ అల్లు అర్జున్ 23పై కాన్సట్రేషన్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం రాకా షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీని వెయిట్ చేయించకుండా ముందుగానే భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట. క్యారెక్టర్ డిజైన్, స్క్రిప్ట్ ఫైనలైజేషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ లాంటి ప్రీ-ప్రొడక్షన్ పనులన్నింటినీ త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడట. రీసెంట్‌గా ముంబయిలో బన్నీపై లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశాడని సమాచారం.

బన్నీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకురావాలని అనుకుంటున్నాడట లోకేశ్‌ కనగరాజ్. గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్స్‌గా నిలవడంతో మళ్లీ ఈ హిట్ పెయిర్ రిపీట్ చేస్తున్నాడని టాలీవుడ్ బజ్. కూలీలో పూజాను జస్ట్ స్పెషల్ సాంగ్‌కే పరిమితం చేసిన లోకీ.. బన్నీ 23లో ఫుల్ తెంత్ రోల్ ఇచ్చి న్యాయం చేయాలనుకుంటున్నాడట. టాలీవుడ్ మీద అలకపూనిన పూజా హెగ్డే బాలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకుందామని వెళితే అక్కడ కూడా సక్సెస్ దక్కలేదు. దాంతో తనకు అచ్చొచ్చిన తెలుగు ఇండస్ట్రీని దూరం పెడితే తన కెరీర్‌కే ఎసరు వచ్చే ఛాన్స్ ఉందని గ్రహించిన బుట్టబొమ్మ. ఎట్టకేలకు దుల్కర్‌ 41లో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట ఈ భామ. ఇక ఎన్నో హోప్స్ పెట్టుకున్న తమిళ్ ఫిల్మ్ జన నాయగన్ మాత్రం ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. బన్నీ సినిమాలో ఫైనల్ అయితే పూజకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.