ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ “ఎల్కేజీ”. 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రిగా నటించగా… ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సెటైరికల్ మూవీకి కేఆర్ ప్రభు దర్శకత్వం వహించారు. చిత్రానికి ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, కథ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇషారీ కె గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి విడుదలకు సిద్ధం అవుతోంది. అదికూడా తెలుగు భాషలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి…
Read Also : “F9” థియేటర్లలో “జురాసిక్ వరల్డ్ డొమినియన్” ప్రివ్యూ
ప్రసిద్ధ తెలుగు ఓటిటి వేదిక ఆహాలో జూన్ 25 నుంచి ఈ చిత్రం ప్రసారం కానున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేశారు. మీరు కూడా పొలిటికల్ సెటైర్లతో హిలేరియస్ గా ఉన్న “ఎల్కేజీ” ట్రైలర్ ను వీక్షించండి.