లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్‌గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే, వారందరికంటే భిన్నంగా నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. “కొడితే నీలా కొట్టాలి రా బాబు, దెబ్బ చంపేసావు, ఇక దున్నే టాలీవుడ్ నీవే” అంటూ ట్వీట్ చేశాడు. అయితే, సాధారణంగా అలా ట్వీట్ చేసి ఉంటే ఓకే, కానీ గత ఏడాది మౌళి చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఈ మేరకు కామెంట్స్ చేశాడు.
Also Read :Ustaad Bhagat Singh: సాంగేసుకుంటున్న ఉస్తాద్
నటుడు కాకముందు మౌళి, ఒక కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియా వేదికగా కామెడీ రీల్స్ చేస్తూ మంచి పేరు సంపాదించాడు. అందులో భాగంగా, అప్పటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా చేసిన ఒక రీల్ వైరల్ అయింది. దీంతో అప్పటి వైసీపీ సపోర్టర్లు అందరూ మౌళి మీద విరుచుకుపడ్డారు. దీంతో, మౌళి సోషల్ మీడియా వేదికగా తాను చేసిన రీల్‌కి ఎలాంటి పొలిటికల్ కనెక్షన్స్ లేవని, దయచేసి ఆ విషయంలో తనను వదిలేయాలని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు దాన్ని ప్రస్తావిస్తూ, “కొడితే నీలా కొట్టాలి, దెబ్బ చంపేసావు పో” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
