NTV Telugu Site icon

Devara : దేవర డబుల్ షేడ్ చూసారా.. ఇక్కడ చూసేయండి..

Untitled Design (29)

Untitled Design (29)

RRR హిట్ తో తారక్ గ్లోబల్ స్టార్ గా మారాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెంచేసింది.

Also Read : Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O

అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు. దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. నేటి నుండి వచ్చే నెల 27కు దేవర రిలీజ్ కు ఇంక నెల రోజులు మాత్రమే ఉందని ఒక నెలలో, అతని రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది, సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మెజెస్టిక్ మ్యాడ్‌నెస్‌ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరలోని తారక్ రెండు షేడ్స్ చూపిస్తూ అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మరో వైపు ఈ చిత్రంలోని మూడవ సాంగ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. చివరి షెడ్యూల్ కొంత షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా దేవరను నిర్మిస్తున్నారు.

Show comments