Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్గా విడుదలైన టాలీవుడ్ చిత్రాల్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల హీరోయిన్గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సతీ లీలావతి’ కూడా ఒకటి. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేమ్ దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే సమ్మర్ సీజన్లో థియేటర్ల వద్ద కొనసాగుతున్న డ్రై పీరియడ్ కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందనను అందుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ రొమ్‌కామ్ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
థియేటర్లలో విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ‘సతీ లీలావతి’ డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకోగా, ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంటి వద్దే ఈ సినిమాను వీక్షించవచ్చు.ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, నాగ మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..