Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushboo Sundar: సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫైర్ బ్రాండ్ ఖుష్బూ సుందర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక – శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఖుష్బూ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్గా ఖుష్బూ, ఆమె భర్త, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుందర్ సి.. కాబోయే వధూవరులు అవంతిక – శ్రవణ్‌లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. పార్లమెంట్ వేదికగా వారిని సాదరంగా ఆహ్వానించిన ప్రధాని మోడీ.. వివాహ ఆహ్వాన పత్రికను అందుకున్నారు. అనంతరం కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు. బిజీ షెడ్యూల్లోనూ తమకు సమయం కేటాయించినందుకు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని ఢిల్లీలో కలవడం మాకు దక్కిన గొప్ప గౌరవం. నా భర్త సుందర్ సి, నేనూ కలిసి మా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేశాం. ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఖుష్బూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అభిమానులు, నెటిజన్లు కాబోయే కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫోటోల్లో ఖుష్బూ ట్రెడిషనల్ పింక్ సిల్క్ శారీలో మెరిసిపోగా.. అవంతిక – శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా కనిపించారు.
Also Read
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
We had the honor of meeting the Honourable Prime Minister of India, Shri @narendramodi ji in Delhi today. My husband, Mr. Sundar C, and I extended an invitation for our daughter’s upcoming wedding to Mr. Shravan Sreenivasan.
The Prime Minister graciously blessed the couple, and… pic.twitter.com/jOex8pcnm3
— KhushbuSundar (@khushsundar) May 29, 2026
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!