Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్ తల్లిని లంచ్ కి ఇన్వైట్ చేసిన థమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushal Sharma eliminated from Telugu Indian Idol 3: ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ కుశాల్ శర్మ ఎలిమినేట్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటీషన్ రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. జూన్ 14, 2024న ప్రారంభమైన ఈ షో ఇప్పుడు కీలకమైన ఎలిమినేషన్ దశలోకి ప్రవేశించింది. ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు న్యాయమూర్తుల స్కోర్‌లు కంటెస్టెంట్స్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పొచ్చు. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, ముగ్గురు కంటెస్టెంట్స్-స్కంద, భరత్ రాజ్ కుశాల్ శర్మ- జడ్జిల నుండి తక్కువ స్కోర్లు అందుకుని డేంజర్ జోన్‌లోకి ప్రవేశించారు. తోటి కంటెస్టెంట్స్ భరత్ రాజ్, స్కందతో కుశాల్ తలపడ్డాడు. స్కంద అత్యధిక ఓట్లు పొంది, మొదట సేఫ్ అయ్యారు. కుశాల్, భరత్ ఎలిమినేషన్ లోకి వచ్చారు.
Deadpool & Wolverine: హైదరాబాద్ లో మార్వెల్ ఫ్యాన్స్ రచ్చ..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఫైనల్ గా ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందిన కుశాల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక సింగర్ కార్తీక్ నుంచి ప్రేరణ పొందిన కుశాల్, షోలో తన అనుభవాన్ని ‘జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం’ అని చెప్పాడు. అతను ఈ వేదికని దేవాలయంగా, న్యాయనిర్ణేతలను తన మార్గదర్శక వ్యక్తులుగా పేర్కొన్నాడు. తనను ఎంతగానో ప్రోత్సహించిన థమన్, గీతా మాధురి, కార్తీక్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ఇక కుశాల్‌కు వీడ్కోలు పలికినప్పుడు తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌తో పోటీ తీవ్రమైంది, 11 మందికంటెస్టెంట్స్ ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక పెర్ఫార్మెన్స్ కొనసాగుతున్న కొద్దీ, పబ్లిక్ ఓటింగ్ , న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అవకాశం ఉంటుంది. ఇక కుశాల్ శర్మ ఎలిమినేట్ కావడంతో కుశాల్ తో కలిసి మదర్ ని లంచ్ కి ఇన్వైట్ చేశారు థమన్.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!