కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న టైమ్ లూప్ డ్రామా “కుడి ఎడమైతే”. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. టైటిల్ కు తగ్గట్లుగానే భిన్నమైన అంశంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు.
Read Also : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థిల్లర్ సీరిస్ టీజర్ సినిమాలోని ప్రధాన తారాగణం ఏదో ప్రమాదంతో ముడిపడి ఉన్నట్లుగా చూపిస్తుంది. రోడ్ యాక్సిడెంట్ లో ఒక అమ్మాయి, అబ్బాయి చనిపోవడం, టీజర్ మొదట్లో మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిన సంఘటనే మళ్ళీ జరుగుతున్నట్టు అన్పించిందా ? అనే వాయిస్ రావడం ఉత్కంఠను పెంచేస్తోంది. వారి జీవితాన్ని, సమయాన్ని మార్చే విధంగా కథలో షాకింగ్ ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ అంశాలు ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఈ వెబ్ సిరీస్ జూలై 16 నుంచి “ఆహా” విడుదల కానుంది.