KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akasamlo Oka Thara: ఇటీవల తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఒక మహిళ అసాధ్యమైన కలలను సాకారం చేసుకునేందుకు చేసే స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించారని తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమాను చూసిన ఆయన, చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపించారు. ఈ మూవీపై ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశానని, సరళమైన కథతో అద్భుతమైన అనుభూతిని అందించారని, ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. ముఖ్యంగా ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాత్విక వీరవల్లి తొలి సినిమాతోనే తన ప్రతిభను చాటుకున్నారని ప్రత్యేకంగా అభినందించారు కేటీఆర్. దర్శకుడు పవన్ సాధినేని పనితీరును కూడా ప్రశంసించారు. ఇలాంటి మంచి సినిమాను అందించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
Also Read
- Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
- January 12 Vidudala: సినిమా అంతా బ్లాక్‌బస్టర్ కళ ఉట్టిపడుతోంది.. ఆ సినిమాపై జీవీ ప్రకాశ్ సెన్సేషనల్ రివ్యూ!
- Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
- Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
ఇక ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మించారు. కేటీఆర్ ప్రశంసలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
KTR: చాలా కాలం తర్వాత అందమైన సినిమా చూశా
-
Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
-
Deepam Row: విజయ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. సీఎస్, డీజీపీ సహా 15 మందికి ధిక్కరణ నోటీసులు!
-
Sumalatha : బాలయ్యపై వ్యాఖ్యలకు జానీ మాస్టర్ భార్య క్షమాపణలు..
-
Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక నిర్ణయం.. PPP విధానంలో అప్పగింత..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!