యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “ఆదిపురుష్”లో హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనన్ సినిమా లీక్ అయ్యింది. కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన నెట్‌ఫ్లిక్స్ తాజా మూవీ “మిమి” జూలై 26న విడుదలైంది. సినిమా విడుదల తేదీని ప్రకటించినదాని కంటే నాలుగు రోజుల ముందే విడుదలైంది. “మిమి” జూలై 30 నుండి నెట్‌ఫ్లిక్స్లో ప్రసారం కావాల్సి ఉంది. అయితే మిమి చిత్రం అధికారికంగా విడుదలకు ముందే పైరేటెడ్ వెబ్‌సైట్లలో లీక్ కావడంతో ముందుగానే రిలీజ్ చేసేశారు మేకర్స్. “మిమి”ని చూసిన విమర్శకులు, ప్రేక్షకులు సోషల్ మీడియా సైట్‌లలో తమ సమీక్షలను పంచుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also : కాబోయే భర్తతో రోబో బ్యూటీ తెగదెంపులు… ఇదే సాక్ష్యం…!
ఇక తమిళ్రాకర్స్, ఫిల్మివాప్, 123 మోవియరుల్జ్, ఫిల్మిజిల్లా, టెలిగ్రామ్‌లో హెచ్.డి క్లారిటీతో “మిమి” ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది. దీనికి లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా, సుప్రియా పాథక్, సాయి తంహంకర్, మనోజ్ పహ్వా కీలక పాత్రల్లో కన్పించారు. ఇందులో కృతి సనన్ సరోగేట్ తల్లిగా నటించింది. కాగా కృతి సనన్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”లో ప్రభాస్ తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోనుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సీత పాత్రను పోషిస్తోంది.