ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం.
ఇక, కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్డు యాక్సిడెంట్ కారణంగా మరణించారు. 1973లో కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. షాక్ కు గురైన రుక్మిణి.. మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణీ. ఈ విషయాలను కోట బయటకు చెప్పలేదు.
