టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సమర్పకుడు కోన వెంకట్ సినిమా విడుదల అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలోని కొందరు దర్శకుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బును వృధా చేసే డైరెక్టర్ల తీరును తప్పుబడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్లానింగ్ లేకుండా 10, 15, 40 రోజులు షూట్ చేసి ఆ తర్వాత ఆ సీన్లను పక్కన పెట్టేయడం చాలా పెద్ద తప్పని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. ఇది కేవలం డబ్బు వృధా మాత్రమే కాదని, దీనిని ‘క్రిమినల్ వేస్ట్’ అని అనాలని అన్నారు. ఒక సినిమాను పది రూపాయల్లో తీయాల్సిన చోట వంద రూపాయలు ఖర్చు పెట్టి, దానిని రికవర్ చేయడానికి నానా తంటాలు పడటం నిర్మాతల పట్ల జరిగే మోసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబీ, శివ నిర్వాణ వంటి డైరెక్టర్లు ఎంతో పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లోనే అద్భుతమైన అవుట్‌పుట్ ఇస్తారని, మిగతా వారు కూడా అలా మారాలని ఆయన హితవు పలికారు. వాళ్ళల్లో మార్పు రావాలన్నది నా ప్రయత్నం.
ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయలేము, తీసుకెళ్లి జైల్లో పెట్టలేము. కాబట్టి వాళ్ళు ఇది విని, వాళ్ళలో ఎంతో కొంత మార్పు వస్తుందన్నదే, మార్పు రావాలన్నదే నా ప్రయత్నం. ఎందుకంటే క్రిమినల్స్ అంటే జరిగేది క్రిమినల్ వేస్ట్. అది చూసి, తెలిసి, విని… ఎందుకంటే నేను చెప్పినట్టు, అందులోనే సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండేది ఏంటి? మన ప్రొడక్షన్ ప్లానింగ్, రైటింగ్, ఎడిటింగ్. మనకి ఎంత కావాలో అంతే తీసుకొని, అవసరం లేని దానికోసం సెట్లు వేయించేసి, యాక్షన్లు చేసేసి, ఇవి చేసేసి… వన్స్ ఆర్డర్ రైట్ అంటే చిన్న చిన్నవి పర్లేదు, లాస్ట్ లో ఏమవుతుందంటే నేను చూశా, చాలా సినిమాలు కొన్ని కొన్ని పండవు. “అరే, ఇది పండలేదే, దాని బదులు ఇంకొకటి చేసుకుందాం, వన్ టూ డేస్ షూట్‌తోటి దానికన్నా బెటర్ మనం అవుట్‌పుట్ క్రియేట్ చేయొచ్చు.” అలాంటివి ఓకే, దోస్ ఆర్ వెల్కమ్, అవన్నీ. బట్ ఇది ఒక 10 డేస్, 15 డేస్, 40 డేస్ షూట్ తీసి పక్కన పెట్టేస్తే ఎలా ఉంటది? అది దట్ ఈజ్ క్రిమినల్ వేస్ట్! అది పాపం ఎవరి తిన్నట్టా డబ్బులు? అని అన్నారు.

