NTV Telugu Site icon

Kollywood : తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్

Dovorce

Dovorce

లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.  నాలుగు నెలలు తిరగకుండానే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా భాను లాయర్ స్టేట్ మెంట్. పగిలిన ముక్కలు తిరిగి అతుక్కోలేవంటూ ఏఆర్ రెహమాన్ తమ రిలేషన్ ఎలా ఉందో ఒక్క ట్వీట్‌తో చెప్పేశాడు.

ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ మాత్రమే కాదు.. మరో టూ పెయిర్స్ కూడా డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి.. కోలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఒకే ఏడాదిలో మామా అల్లుళ్లు.. ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ తమ జీవిత భాగస్వాములకు బ్రేకప్ చెప్పారు. సింగర్ సైంధవితో 11 ఏళ్ల రిలేషన్‌కు ఎండ్ కార్డ్ వేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. మ్యూజిక్‌తో ఉర్రూతలూగించే కంపోజర్స్ తమ లైఫ్‌లో చేదు బాణీలు  స్వరపరుస్తున్నారు. ఇక ఎంతో అన్యోన్యంగా కనిపించే కోలీవుడ్ స్టార్ జోడీ జయం రవి, ఆర్తి డివోర్స్ న్యూస్ ఎనౌన్స్ చేసి సడెన్ షాక్ ఇచ్చారు. 15 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు ఈ పెయిర్. భార్య ఆర్తి ఇబ్బంది పెట్టడం వల్లే జయం రవి సెపరేషన్‌ కోరినట్లు కోలీవుడ్ టాక్.

Also Read : Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’

వీళ్లే కాదు గతంలో ధనుష్, ఐశ్వర్య, అక్కినేని నాగ చైతన్య, సమంత, అమలా పాల్, ఎఎల్ విజయ్ సెపరేషన్ న్యూస్ కోలీవుడ్ ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. ఎన్ని రోజులు రిలేషన్ షిప్‌లో ఉన్నా, ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోవడం, బిలీవ్ కోల్పోవడం, వర్క్‌లో పడి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, కొరవడిన ప్రేమానురాగాలు ఈ కఠిన నిర్ణయానికి కారణమౌతున్నాయన్నది కొంత మంది వాదన. ఇది ప్యూర్లీ పర్సనల్ మ్యాటర్ అని కవర్ చేసుకుంటున్నప్పటికీ  సెలబ్రిటీల లైఫ్ స్టైల్‌ను ఫాలో అయ్యే ప్రతి ఆడియన్ ఇలాంటి వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం

Show comments