NTV Telugu Site icon

Mithilesh Chaturvedi: బాలీవుడ్ లో విషాదం!

Mithilesh Chaturvedi

Mithilesh Chaturvedi

నటుడిగా బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకన్న మిథిలేశ్‌ చతుర్వేది బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో హృదయ సంబంధమైన వ్యాధికి చికిత్స చేయించుకున్న ఆయన తన స్వస్థలం లక్నోకు కొద్దిరోజుల క్రితం వచ్చారని, ఇక్కడ మరోసారి గుండెపోటు రావడంతో తదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’, సన్నీ డియోల్ ‘గదర్’, జెడీ చక్రవర్తి ‘సత్య’తో పాటు ‘బంటీ ఔర్ బబ్లీ, క్రిష్‌, తాల్, రెడీ, అశోక్, ఫిజా’ వంటి ఎన్నో చిత్రాలలో మిథిలేశ్‌ చతుర్వేది నటించారు.

read also: Ram Gopal Varma: టాలీవుడ్‌ అసలు శత్రువు రాజమౌళినే!

పలు వాణిజ్య ప్రకటనలతో పాటు టీవీ సీరియల్స్ లోనూ కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య వచ్చిన ‘నీలీ ఛత్రీ వాలే’, ‘ఖయామత్’, ‘పాటియాల్ బేబీస్’ వంటి టీవీ షోస్ తో పాటు ‘ద స్కామ్’ వెబ్ షో లో రామ్ జఠ్మలానీ పాత్రను మిథిలేశ్‌ చేశారు. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ లో చివరి సారిగా మిథిలేష్ నటించారు. ఈ సీనియర్ నటుడి మృతి పట్ల బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
49th Chief Justice of India : తన వారసుడి పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన ఎవరంటే..?

Show comments