Site icon NTV Telugu

Kishkindapuri : క్లీన్ హిట్ కొట్టిన బెల్లంకొండ

Kishkindapuri

Kishkindapuri

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్‌లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయినట్లు సమాచారం.

Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు..

అంతేకాక, ఆంధ్ర సహా సీడెడ్ ప్రాంతాల్లో ఇప్పటివరకు 90% పైగా ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ వచ్చిందని, మరికొద్ది రోజుల్లో ఫుల్ రికవరీ సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ దెబ్బతో సాయి శ్రీనివాస్‌కి హిట్ అందిస్తూ, 2025లో క్లీన్ హిట్ దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమాని ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా డైరెక్టర్ చేసిన కౌశిక్ పెగడ్లపాటి డైరెక్ట్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

Exit mobile version