Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘#REALITY’ (రియాలిటీ) ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సినిమాలోని సాంగ్ జెన్యూన్‌గా హిట్ అయితే.. ఆ ప్రాజెక్ట్ బిజినెస్ రేంజ్ ఎలా మారిపోతుందో కిరణ్ అబ్బవరం సినిమా కళ్లెదుట నిరూపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన తొలి గీతం ‘భజ గోవిందం’ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని ఇన్స్టంట్ హిట్‌గా నిలిచింది. ఆ ఒక్క పాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో ఈ సినిమా ఆడియో రైట్స్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’ ఏకంగా రూ. 3.5 కోట్లకు ‘రియాలిటీ’ ఆడియో హక్కులను సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కిరణ్ అబ్బవరం సినిమా రేంజ్‌కి, బడ్జెట్‌కి ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫిగర్ అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.
మ్యూజికల్‌గా ఈ సినిమాను దర్శకుడు కిరణ్ అబ్బవరం ఓ రేంజ్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో విపరీతమైన ఆదరణ పొందిన ‘రఘుకుల తిలక రారా’ గీతాన్ని.. ఈ సినిమా కోసం డీజే మిక్స్ చేసి మరింత ట్రెండీగా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా వాడుకోబోతున్నారు. దీనికి తోడు సినిమాలో కుర్రకారును స్టెప్పులు వేయించేలా ఓ మాస్ ‘సంగీత్ సాంగ్’ కూడా ఉండబోతోందట. ఈ సాంగ్స్ అన్నీ ఆల్బమ్‌కు మరింత హైప్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆడియో రైట్స్ ద్వారా అదిరిపోయే ఓపెనింగ్ బిజినెస్ చేసిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు నాన్-థియేట్రికల్ డీల్స్‌ను కూడా భారీ రేట్లకు క్లోజ్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సినిమా థియేటర్లలోకి రాకముందే పూర్తి పెట్టుబడి వెనక్కి వచ్చేసి ‘టేబుల్ ప్రాఫిట్’తో మేకర్స్ సేఫ్ జోన్లో కూర్చోవడం పక్కా అని సమాచారం. మొత్తానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా కిరణ్ అబ్బవరం తన తొలి ప్రయత్నం ‘రియాలిటీ’తో రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.
Also Read
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
- AR Rahman: "ఆ ఓపిక, సమయం నాకు లేదు".. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
తాజావార్తలు
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
ట్రెండింగ్
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!