Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!

Chennai Love Story Trailer

Chennai Love Story Trailer

Chennai Love Story Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్‌ను మేరక్స్ తాజాగా అఫిషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, విధి కలిసి ఓ అందమైన ప్రయాణంగా ఎలా మారతాయో ట్రైలర్‌లో మేకర్స్ చూపించారు. స్టీవెన్, నివి అనే ఇద్దరు యువతీయువకుల ప్రేమకథ చుట్టూ ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ప్రేమలోని ఆనందం, బాధ, కలలు, జీవితాన్ని మార్చే కీలక క్షణాలను డైరెక్టర్ హృద్యంగా ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల మధ్య కెమిస్ట్రీ, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు నుంచి నేను మీరు నా దేవత.. నేను మీ బానిస.. అంటూ పలికిన డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం నిజాయితీతో కూడిన, భావోద్వేగభరితమైన యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, తాజా ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.