విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కట్ కూడా రిలీజ్ అయింది. ప్రేక్షకులలో ఈ ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీలు స్ఫూర్తి అయ్యాయి. సెన్సార్ రెండు రోజుల క్రితమే పూర్తయింది కాగా, ఈ రోజు అధికారిక సర్టిఫికెట్ జారీ చేశారు.
Also Read : Kaantha Teaser: సినిమా పేరు శాంత కాదు కాంత.. ఆడియన్స్ కి ఇదే నచ్చుతుంది!
160 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండబోతున్నట్లు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, కొన్ని కట్స్ సినిమా టీమ్‌కు వెల్లడించింది. అందులో “భగత్” అనే ఒక టైటిల్ ప్రస్తావన తొలగించాలని కోరింది. అలాగే, “ముసలి ముండా కొడకా” అనే పదం తొలగించాలని వెల్లడించింది. కొన్ని సన్నివేశాల్లో డెడ్ బాడీలు చూపకూడదని, వాటిని కట్ చేయాలని సూచించింది. అలాగే, రక్తం కారుతున్న రక్తంతో ఉన్న పూల్ విజువల్స్ తొలగించాలని ఆదేశించింది. అలాగే, వెన్నుపోటు పొడవడంతో పాటు గొంతు కోసే సన్నివేశాలు తొలగించాలని, అలాగే సీన్‌ను 50 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. అలాగే, సినిమాలో పాత్రలు సిగరెట్ తాగుతున్న సమయంలో “స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్” అని కింద డిస్‌ప్లే చేయాలని వెల్లడించింది. ఇక, మరికొద్ది సేపట్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది.