విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్‌గా కింగ్‌డమ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు వచ్చేసింది. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా అదిరిపోయింది అని చాలామంది అంటుంటే, సెకండ్ హాఫ్ అంతగా లేదని కొందరు అంటున్నారు.
Also Read:Venkitesh: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ విలన్ దొరికాడోచ్
ఏదైతేనేం, మొత్తం మీద సినిమా కొంతవరకు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక ఆసక్తికరంగా ఎక్స్ లో పోస్ట్ చేసింది. “ఈ విజయం నీకు ఎంత అవసరమో నాకు తెలుసు, అలాగే నిన్ను ప్రేమించే వాళ్లకు తెలుసు, మనం కొట్టినం” అని రష్మిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దానికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ “మనం కొట్టినం” అంటూ రిప్లై ఇచ్చాడు. చాలా రోజుల క్రితం నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం ఉంది. దాన్ని వీరు ఎప్పుడూ ఖండించలేదు, అలా అని ధృవీకరించలేదు. మొత్తం మీద రష్మిక చేసిన పోస్ట్‌కి దేవరకొండ ఇచ్చిన రిప్లై అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
:,)))
Manam kottinam ❤️— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2025
