Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా తమ సినిమాపై నమ్మకంతో దర్శకులు స్టేజ్ మీద రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కాలరెగరేయడం, తొడగొట్టడం, సినిమా ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ వదిలేస్తాం అనడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ, ‘కిల్లర్’ సినిమా దర్శకుడు, హీరోయిన్ జ్యోతి భర్త సుకు పూర్వాజ్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ సెన్సేషనల్ ఛాలెంజ్ విసిరారు. కిల్లర్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాలోని స్క్రీన్ స్పేస్, స్పీడ్ చాలా డ్రిఫ్ట్గా వెళ్తుందని, దానికి ఆడియన్స్ అలవాటు పడటానికి ఒకట్రెండు నిమిషాలు పడుతుందని సుకు పూర్వాజ్ తెలిపారు. ఫస్ట్ హాఫ్ రన్ టైం సుమారు ఒక గంట ఉంటుందని, అందులోని లేయర్స్ ప్రేక్షకులను తనతో పాటు ట్రావెల్ చేయిస్తాయన్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎవరూ ఊహించని విధంగా ‘బిగ్గెస్ట్ బ్యాంగ్’లా ఉంటుందని, అసలు “ఆమె ఎవరు? (హూ ఈజ్ షి?)” అనే క్వశ్చన్ మార్క్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుందని చెప్పారు.
సినిమాపై తనకున్న నమ్మకంతో ఏకంగా కోటి రూపాయల ఓపెన్ ఛాలెంజ్ విసిరారు దర్శకుడు. “నేను స్టేజ్ మీద కాలరెగరేయడం, తొడగొట్టడం లాంటివి చేయను. నేరుగా ఓ చెక్ తీసుకొచ్చాను. ఈ నెల 29న రాత్రి లేదా 30వ తేదీన సినిమా ఫస్ట్ షో ప్రీమియర్స్ పడతాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మేము ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాం. సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ పడిన 5 నిమిషాల లోపు.. సెకండ్ హాఫ్‌లో రాబోయే నోవెల్ పాయింట్, ట్విస్ట్ లేదా క్లూ వర్డ్ ఏంటో కనిపెట్టి ఆ నెంబర్‌కు వాట్సాప్ చేస్తే చాలు. సరైన సమాధానం చెప్పిన వారికి సక్సెస్ మీట్ రోజున ఏకంగా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాను” అని ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ విషయంలో తన భార్య జ్యోతిని, నిర్మాతను అడగొద్దని, నేరుగా తననే అడగాలని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో పాటు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మహిళల కోసం ‘సూపర్ షీ’ అనే కంటెస్ట్‌ను రన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. “ఒకవేళ మీకు రాత్రికి రాత్రి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారు?” అని అడగ్గా, ఇప్పటికే 2127 మంది మహిళల నుంచి ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయన్నారు. అందులోంచి బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన 10 మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ. 1,40,000 చొప్పున ప్రీ-రిలీజ్ ఈవెంట్ రోజున బహుమతిగా అందించనున్నట్లు సుకు పూర్వాజ్ తెలిపారు. మొత్తానికి ఎలాంటి ప్రగల్భాలు పలకకుండా, నేరుగా కోటి రూపాయల చెక్ చూపిస్తూ దర్శకుడు విసిరిన ఈ సవాల్‌తో ‘కిల్లర్’ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇలాంటి సినిమా ఇంతవరకు ఎవరూ చూసి ఉండరని చెబుతున్న ఈ చిత్రంలో.. డైరెక్టర్ దాచిన ఆ అసలు ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!
Also Read
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
- RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
తాజావార్తలు
-
Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
-
BJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ ‘‘జెన్-జీ’’ కాదు.. తిరంగాతో సానుభూతి యత్నం!
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..