Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..

Kiara Advani Toxic Intimate Scenes

Kiara Advani Toxic Intimate Scenes

Kiara Advani: పెళ్లయిన తర్వాత హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటిస్తే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ సినిమాలోని ఇంటిమేట్ సీన్ల విషయంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వివాదం నడుస్తున్న సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కనీసం ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదని కియారా తాజాగా వెల్లడించారు. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’ షోలో సిద్ధార్థ్‌తో కలిసి పాల్గొన్న కియారా, ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. పెళ్లి తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించడంపై వచ్చిన విమర్శలను సిద్ధార్థ్ అసలు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. “ఆ ట్రోలింగ్ గురించి సిద్ధార్థ్ నాతో ఎప్పుడూ ప్రస్తావించలేదు, మేమిద్దరం దాని గురించి అసలు మాట్లాడుకోలేదు. ఆయన ఏమాత్రం బాధపడలేదు” అంటూ భర్త తనకు ఇచ్చిన సపోర్ట్ గురించి కియారా చెప్పుకొచ్చారు.

ఇక తనపై జరిగిన ట్రోలింగ్‌ను తాను కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని కియారా అన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇలాంటి విమర్శలు కొత్తేమీ కాదని, దశాబ్దాలుగా ఇదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో ఐశ్వర్య రాయ్ నుంచి ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అందుకే ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు కనిపించలేదని చెప్పారు. మరోవైపు, ‘టాక్సిక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంపై కియారా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజైన మొదటి వీకెండ్‌లో వచ్చిన ఫలితం తనను చాలా నిరాశపరిచిందన్నారు. అయినప్పటికీ, తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన పాత్రకు ప్రశంసలు దక్కడం సంతోషాన్నిచ్చిందని, ఈ సినిమా తన కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని కియారా చెప్పుకొచ్చారు.