కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు. అదేనండీ వీరిద్దరూ మరో జీవికి ప్రాణం పొయనున్నారు. ఈ శుభవార్తను ఈ జంట తమ అభిమానులతో పంచుకున్నారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్లు అభిమానులతో శుభవార్త పంచుకుంది. కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ‘మన జీవితంలో అత్యంత అందమైన బహుమతి రాబోతోంది’ అని రాసుకొచ్చింది.
Kingston: తెలుగులోకి మార్చి 7న మరో డబ్బింగ్ సినిమా ‘కింగ్స్టన్’
అంతేకాక చేతులు ముడుచుకున్న ఎమోజీని సృష్టించారు. ఆ ఫొటోలో కియారా -సిద్ధార్థ్ చేతులు కనిపిస్తున్నాయి, వాటిపై ఉన్నితో చేసిన చిన్న తెల్లని రంగు సాక్స్ ఉన్నాయి. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ 2023లో వివాహం చేసుకున్నారు. ఈ జంట ఫిబ్రవరి 07, 2023న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో ఏడు అడుగులు వేశారు. కియారా, సిద్ధార్థ్ ల ప్రేమకథ ‘షేర్షా’ సినిమా సమయంలో మొదలై పెళ్లి వరకు వెళ్ళింది.