Kingston: తెలుగులోకి మార్చి 7న మరో డబ్బింగ్ సినిమా ‘కింగ్స్టన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే మార్చ్ 7న హిందీ డబ్బింగ్ చావా, మలయాళ డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ కానుండగా ఇప్పుడు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. హీరో గానూ, మ్యూజిక్ కంపోజర్ గానూ రాణిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కింగ్స్టన్’. తొలి భారతీయ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా ‘కింగ్స్టన్’ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు రూపొందించాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
Suzhal 2: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘సుడల్ సీజన్ 2’ వచ్చేసింది!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆ ట్రైలర్ పరిశీలిస్తే అనగనగా ఓ ఊరు… అది సముద్ర తీరంలో ఉంది. ఆ ఊరిలో ఏదో ఉందని, ఇంకేదో జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ‘ఒకరి అత్యాశ ఈ ఊరిని నాశనం చేసింది. మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకు’ అని ఎందుకు ఒకరు చెప్పారు… సముద్రంలోకి హీరో ఎందుకు వెళ్ళాడు? ఆ తర్వాత ‘ఒడ్డున ఎవరి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావాలి’ అని హీరో ఎందుకు చెప్పాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సముద్రంలోకి హీరో వెళ్ళినప్పుడు అతని దగ్గరకు వచ్చిన దెయ్యాల కథ ఏమిటి? అనేది ఆసక్తికరం. సముద్రంలో సాహసాలను, దెయ్యాలను, ఫాంటసీనీ కలగలిపి ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందనే భావాన్ని ఈ ట్రైలర్ కచ్చితంగా కలిగిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సరసన దివ్యభారతి హీరోయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో చేతన్, అళగన్ పెరుమాళ్, ఎలాంగో కుమార్ వేల్, రాజేష్ బాలాచంద్రన్, అరుణాచలేశ్వరన్ ఇతర ప్రధాన తారాగణం.
తాజావార్తలు
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!