సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో అటువంటి పరిస్థితే ఎదురైంది…
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జంటగా డైరెక్టర్ విష్ణువర్ధన్ రూపొందించిన చిత్రం ‘షేర్ షా’. కెప్టెన్ విక్రమ్ బత్రా బయోపిక్ గా ఈ వార్ మూవీని తీశారు. ఆగస్ట్ 12న అమేజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. అయితే, ‘షేర్ షా’ విషయంలో అందరి ఆసక్తికి కారణం సినిమా కథ, కథనం, ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాత్రమే కాదు! చాలా మందికి సిద్ధార్థ్, కియారా తెరపై జంటగా ఎలా కనిపిస్తారా అనే అంశం ఇంట్రస్టింగ్ గా ఉంది! వారిద్దరూ రియల్ లైఫ్ లోనూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ టాక్!
Read Also : ‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?
సిద్దూ, కియాల లవ్ స్టోరీ అటుపోయి, ఇటుపోయి డైరెక్టర్ విష్ణువర్దన్ వద్దకొచ్చింది! ఆయన తమిళంలో ఆల్రెడీ పేరున్న దర్శకుడు. ‘షేర్ షా’తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ, తనదైన స్టైల్ లో ప్రశ్నలు సంధించిన బాలీవుడ్ మీడియా, విష్ణుని, ఆయన చిత్రంలోని హీరో, హీరోయిన్ రియల్ రొమాన్స్ గురించి ప్రశ్నించింది! “సిద్ధార్థ్, కియారా డేటింగ్ చేస్తున్నారా?” అంటూ కొశన్ చేసింది! ఇలాంటివి పాపం తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కి సౌత్ లో అలవాటున్నవి కాదు కదా… కానీ, జాగ్రత్తగానే తెలివైన సమాధానం ఇచ్చాడు ‘షేర్ షా’ మూవీ దర్శకుడు!
“నేను సినిమా తీస్తున్నప్పుడు నాకు హీరో, హీరోయిన్ సిద్ధార్థ్, కియారా కాదు. వారిద్దరూ నాకు కెప్టెన్ విక్రమ్ బత్రా, డింపుల్ (రియల్ లైఫ్ లో విక్రమ్ బత్రా ప్రేయసి). ఆ పాత్రల్లోనే వారిని నేను చూస్తాను. నిజ జీవితంలో సిద్ధార్థ్, కియారా మధ్య రిలేషన్ ఎలా కొనసాగినా దాని ప్రభావం నా సినిమాపై అస్సలు పడదు!” అన్నాడు విష్ణు. ఇంతకీ, సిద్ధార్థ్, కియారా లవ్ లో ఉన్నారా లేదా? వారి మధ్య డేటింగ్ పుకార్లన్నీ వట్టివేనా? డైరెక్టర్ విష్ణువర్ధన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే సేఫ్ గా తప్పించుకున్నాడు!
