సంతోష్ శివన్ కు పితృవియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్టిల్ ఫోటోగ్రాఫర్ శివన్ (89) కన్నుమూశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఆయన కుమారుడే! అరవై సంవత్సరాల క్రితం ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియోను పెట్టారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా శివన్ విశేష ఖ్యాతి గడించారు. పలు సాంస్కృతిక సంస్థలకు ఆయన ఫోటో స్టూడియోనే కేంద్రంగా ఉండేది. ఆయన తీసిన ఛాయాచిత్రాలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అనంతరం శివన్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. శివన్ రూపొందించిన ‘అభయమ్’ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి శివన్ అడుగు జాడల్లోనే నడిచిన రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా ఖ్యాతి గడించారు. శివన్ పెద్ద కుమారుడు సంగీత్, చిన్నకుమారుడు సంజీవ్ కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. మూడు జాతీయ అవార్డులను అందుకున్న శివన్ తిరువనంతపురంలోని ఇంటిలో ఈ రోజు ఉదయం పడిపోయారు. హాస్పిటల్ కు తరలించగా, గుండెపోటుతో అప్పటికే మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. శివన్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
-
Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
-
Sunil Gavaskar: “పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్‌లో వికెట్ కీపర్ అతడే”.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!