Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!

Nani The Paradise Movie Update, Kayadu Lohar

Nani The Paradise Movie Update, Kayadu Lohar

Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ పాత్రపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై కయాదు స్వయంగా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది.

ఈ సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేసింది. “ప్రస్తుతం నెట్టింట నడుస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఈ చిత్రంలో జర్నలిస్ట్ రోల్ చేయడం లేదు. అసలు జర్నలిజానికి, నా క్యారెక్టర్‌కి ఎలాంటి సంబంధమూ ఉండదు” అని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన రోల్ గురించి మాట్లాడుతూ.. “ప్రేక్షకులు బయట ఏదేదో కథలు ఊహించుకుంటున్నారు. కానీ వాళ్లు అనుకుంటున్న దానికి, తెరపై కనిపించబోయే పాత్రకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో కథానాయికను ఇప్పటివరకు ఇలాంటి రోల్‌లో ఎవరూ చూసి ఉండరు. నా క్యారెక్టర్ పూర్తిగా భిన్నంగా, అనూహ్యమైన మలుపులతో సాగుతుంది” అని పేర్కొంది. రిలీజ్‌కు ముందే ఇలాంటి పాత్రపై అభిమానులు సొంత సిద్ధాంతాలు అల్లేసుకుంటారని, అయితే థియేటర్లలో తన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కయాదు ఇచ్చిన ఈ క్లారిటీతో ‘ది ప్యారడైజ్’లో ఆమె రోల్ చుట్టూ ఉన్న సస్పెన్స్ మరింత పెరిగింది.