Site icon NTV Telugu

‘సలార్’ స్పెషల్ సాంగ్ లో కత్రినా!

‘రాధేశ్యామ్‌’ షూటింగ్ పూర్తిచేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. కత్రినా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సలార్ స్థాయి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version