Karthikeya: ఆ వీడియోలో భాగమైనందుకు చింతిస్తున్నా.. ప్రణీత్ హనుమంతు వివాదంపై హీరో స్పందన
- ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద ఒక్కరక్కరుగా స్పందిస్తున్న సినీ సెలబ్రిటీలు
- ప్రణీత్ హనుమంతు వివాదంపై హీరో కార్తికేయ స్పందన
- ఆ వీడియోలో భాగమైనందుకు చింతిస్తున్నా: హీరో కార్తికేయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthikeya Responds on Praneeth Hanumanthu Issue: నటుడిగా మారిన యూట్యూబరు ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరమ్ తేజ్ స్పందించగా తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి వాళ్లు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ఇతరుల మీద అనవసరమైన తప్పుడు జోక్స్ వేసుకుంటూ కాలం గడపడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. తమను తాము కూల్ అలాగే న్యూ ఏజ్ పీపుల్ అని భావిస్తూ ఈ వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను ఎంకరేజ్ చేసిన వాళ్లే వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చారు.
Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఇకమీదట అలాంటి కంటెంట్ ని ఎంకరేజ్ చేయొద్దని నేను సూచిస్తున్నాను. కచ్చితంగా విషయంతో కూడిన విమర్శలను అలాగే ఆరోగ్యకరమైన జోక్స్ ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇలాంటి దారుణమైన విషయాల మీద కూడా జోక్స్ వేస్తే ఒక సమాజంగా మనం వెనక్కి నడుస్తున్నట్టే భావించాలి. ఒకళ్ళని వెనక్కి లాగే ఆలోచన కంటే ఇతరులకు సహాయం చేస్తూ ఒకరితో కలిసి ముందుకు ఎలా వెళ్లాలి అనేది ఆలోచించాలి. నేను కేవలం ఆ ఒక్క జోక్ మీద మాత్రమే ఖండించడం లేదు ఎవరైతే దారుణమైన వ్యాఖ్యలతో కామెడీ పుట్టించాలనుకుంటున్నారో వాళ్లందరి అభిప్రాయాలను ఖండిస్తున్నానని అన్నారు. అవును నేను వాళ్లకి ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాను. అందరికీ ఎలా ఇంటర్వ్యూస్ ఇచ్చానో వాళ్ళకి కూడా అలాగే ఇచ్చాను, అయితే అప్పుడు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు విని కొంచెం షాక్ అయ్యాను కానీ అప్పుడు ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భావించి నాకు వీలైనంతలో స్పోర్టివ్ గానే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను.
నిజానికి ముందుగా చెప్పినట్టు ఇంట్లో నేను ఏదైతే చెప్పానో దానికే నిలబడి ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఖండించడానికి ముందుకు వచ్చాను. నిజానికి నేను వాళ్లతో ఇంటర్వ్యూ చేయకుండా ఉండాల్సింది కానీ హీరోగా సినిమాని ప్రమోట్ చేసుకునే బాధ్యతతో ఆ సినిమాని ప్రేక్షకులకు ఇంకా అంత దగ్గర చేసే ఉద్దేశంతోనే ఇంటర్వ్యూ చేశాను. అయితే అలాంటి కంటెంట్ ని పోస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఆ వీడియోలో నేను కూడా ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను ఇకమీదట నేను ఎవరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాననే విషయం మీద చాలా జాగ్రత్తగా ఉంటాను. అలాంటి కంటెంట్ ని ఏ మాత్రం ఎంకరేజ్ చేయను. దయచేసి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?