కార్తిక్ రాజు…ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన “తిరుదన్ పోలీస్” సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది.
Also Read:Samyukta: పేరు మార్చుకున్న సంయుక్త?
ఆ తర్వాత “ఉల్కుతు” మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం “నేనే నా” తో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన “నిను వీడని నీడను నేనే` సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇక రీసెంట్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన #సింగిల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో టాలీవుడ్‌లో విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
Also Read:Kannappa: కన్నప్ప’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
#సింగిల్ సినిమా విజయం తర్వాత, ప్రముఖ హీరోలతో కొత్త ప్రాజెక్టుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు కార్తీక్ రాజును సంప్రదిస్తున్నాయని తెలుస్తోంది. ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం ఆయన టాప్-మోస్ట్ బ్యానర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. త్వరలో ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారని అంటున్నారు.
