ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తూ, రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన సినిమా కన్యాకుమారి. కన్యాకుమారి సినిమా ఆగస్టు 27న గణేశ్ చతుర్థి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
Also Read:Prabhas : గుడ్ న్యూస్.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ప్రకటన
“ఆర్గానిక్ ప్రేమ కథ” అనే ఆకర్షణీయ ట్యాగ్‌లైన్‌తో, శ్రీచరణ్ గీత్‌ను సంతోషంగా ఎత్తుకుని, ఆమె చేతులపై సీతాకోకచిలుక రెక్కలతో కనిపించే పోస్టర్ సినిమా యొక్క సున్నితమైన ఆకర్షణను చాటుతోంది. శ్రీకాకుళం గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, రవి నిడమర్తి సంగీతం, శివ గాజుల, హరి చరణ్ కె ఛాయాగ్రహణం, నరేష్ అడుప ఎడిటింగ్‌తో జీవన రాగాన్ని అందిస్తుంది. టీజర్‌తో ఇప్పటికే ఆకట్టుకున్న *కన్యాకుమారి*, భారీ ప్రమోషన్లతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.