Site icon NTV Telugu

Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ బుకింగ్స్..డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

Kantara 1

Kantara 1

రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1న ప్రీమియర్ షోలతో స్క్రీనింగ్స్ ఆరంభమైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాంతార మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కాంతార చాప్టర్ వన్ అన్ని విధాలుగా అందుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేక్షకులు ఈ సినిమాను ‘డివైన్ బ్లాక్‌బస్టర్’గా కొనియాడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో, మొదటి రోజు కలెక్షన్స్ భారీగా నమోదై, అధికారిక ప్రకటన ప్రకారం సుమారు 89 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ లెక్కన కాంతార చాప్టర్ వన్ 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.

Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్‌ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే

ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను ఏ స్థాయిలో అందుకుందంటే, ఒక్క బుక్ మై షో యాప్‌లోనే రిలీజ్ రోజున 1.28 మిలియన్‌కు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇతర ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌లతో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లను కలుపుకుంటే, మొదటి రోజు కలెక్షన్స్ సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెండవ రోజు కూడా ఈ జోరు కొనసాగుతోంది. గంటకు 70 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే, కాంతార చాప్టర్ వన్ ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Also Read :Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం

రిషబ్ శెట్టి నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉందని, కథను నడిపించిన తీరు నెక్స్ట్ లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు, విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ భాషలో రూపొందించి, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరాం వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించి, సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిషబ్ శెట్టి దర్శకత్వ ప్రతిభ, నటనా నైపుణ్యం, హొంబాలే ఫిల్మ్స్ నిర్మాణ విలువలు, బలమైన కథాంశం కలిసి ఈ సినిమాను 2025లో ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిపాయి. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version