డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం భారీ ఎత్తున రూపొందుతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఇటీవల బెంగుళూరులో ప్రారంభించాడు చిత్ర హీరో మంచు విష్ణు.
Also Read : Anil Ravipudi సంక్రాంతికి వస్తున్నాం 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్
కాగా ఈ చిత్రంనుండి ఇప్పటికే హీరో మంచు విష్ణు, మోహన్ బాబు, మలయాళ స్టార్ మోహన్ లాల్ తో పాటు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రభాస్ ఈ సినిమాలో దర్శనమిస్తాడని తెలుస్తోంది. అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడు లుక్ ఎలా ఉంటది అని ఎదురుచూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు కన్నప్ప మేకర్స్. ఫిబ్రవరి 3న రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నామని అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో నిర్మిస్తున్నారు.