Site icon NTV Telugu

Mohan Babu : బావ, దీనికి నువ్వు రావాలా? అని ప్రభాస్ అడిగాడు!

Prabhas

Prabhas

కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా బావ ప్రభాస్. బావ, బావ అని అనుకుంటూ ఉంటాం మేం ఇద్దరం కొన్ని సంవత్సరాలుగా. మా సినిమా చేశాడని చెప్పడం లేదు. చేసినా, చేయకపోయినా, మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్,” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Also Read : Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!

“ఒకసారి నేను ఫోన్ చేసి, ‘ఇంటికి రానా?’ అని అడిగాను. ‘రేపు ఎల్లుండి రమ్మన్నాడు.’ నేను, ‘ఒక పని మీద వస్తున్నాను, నీవు ఎస్ ఆర్ ఎన్ చెప్పమంటే ఏంటి?’ అని అడిగాడు. ‘నీవు కంగారు పడవద్దు,’ అని చెప్పి, వెళ్లి కూర్చుని, ‘ఈ సినిమాలో ఇన్ని రోజులు వర్షం ఉంది. నీవు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీవు ఇండియాలోనే టాప్ హీరో. ఈ రోజు నీవు కాదన్నా, మీ సినిమా కోసం అడిగితే నేను యాక్ట్ చేస్తాను. దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు చేయవలసి ఉంటుంది, చేయగలవా లేదా?’ అని అడిగాను. దానికి ప్రభాస్, ‘బావ, దీనికి నీవు రావాలా? నేను విష్ణుతో మాట్లాడుకుంటాం, మేం చేస్తాం,’ అన్నాడు.

Also Read : OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..

ఒకటే మాట, అదే ఫైనల్. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం మాకు ఎంతో ఇష్టమైనది. ప్రభాస్, ప్రభాస్ తండ్రి కృష్ణంరాజు, ఇలా ఒక్కరు కాదు, ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. కాబట్టి, ప్రభాస్ 100 సంవత్సరాలు ఆ శిరిడి సాయి ఆశీస్సులతో, పరమేశ్వరి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను,” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version